YSR Kalyanamasthu | వైయస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకం వివరాలు

YSR Kalyanamasthu Scheme 2022 :

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకు తనవంతు సహాయంగా కానుక అందించేందుకు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను ఇవ్వనున్నారు. అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలు అలానే అబ్బాయి వయస్సు 21సంవత్సరాలు ఉన్నట్లయితే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అక్టోబర్ 1, 2022 నుండి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి రూ లక్షా 20 వేలు కానుకగా ఇస్తారు. దివ్యాంగులకు ఈ పథకం కింద రూ లక్షా యాభై వేల రూపాయలు ఇవ్వనున్నారు. అర్హతలు, దరఖాస్తు విధానాలు క్రింది విధంగా ఉంటాయి.

Latest Updates
1. అప్లికేషన్ స్టేటస్ ను తెలుకోవడానికి క్లిక్ చేయండి. – క్లిక్ హియర్

YSR Shaadi Tohfa Scheme :

పేరువైయస్సార్ పెళ్లికానుక
పథకం ప్రారంభించినదివైఎస్ఆర్ జగన్ మోహన్ రెడ్డి
లబ్ధిదారులుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు
ప్రారంభించిన తేది సెప్టంబర్ 30, 2020
అమలు చేసిన తేది అక్టోబర్ 01, 2020
ధ్యేయంఆర్థిక సహాయం అందించడం
అధికారిక వెబ్సైటు ysrpk.gov.in
YSR Kalyanamasthu Scheme

YSR Kalyanamasthu Scheme Eligibility :

  • వైఎస్సార్ కళ్యాణమస్తు పథకానికి వధువు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారై ఉండాలి లేదా భవన కార్మికుల కుటుంబంలో జన్మించి ఉండాలి.
  • వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18 అలానే వరుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి.
  • వధువు, వరుడు పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. (ఈ షరతుకు 2024 జూన్ 30 వరకు సడలింపు ఇస్తారు)
  • తొలి వివాహానికి మాత్రమే అర్హత ఉంటుంది.
  • వరుడు, వధువు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పది వేల రూపాయల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 12 వేల రూపాయల్లోపు ఉండాలి.
  • మూడు ఎకరాలకు మించి మాగాణి లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు.
  • మెట్ట, మాగాణి రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండొచ్చు.
  • కుటుంబాల్లో సభ్యులెవ్వరూ కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లోగానీ లేదా ప్రభుత్వ సంస్థల్లో గానీ ప్రభుత్వ ఉద్యోగిగా లేదా పెన్షర్గా ఉండకూడదు.
  • పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంది.
  • నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు (టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు).
  • నెలవారీ విద్యుత్ వినియోగం (గత 12 నెలల సగటు) 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి.
  • ఏ కుటుంబమూ ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు.
  • మునిసిపల్ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మించిన ఆస్తిని కలిగి ఉండకూడదు.
  • ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు గ్రామ వారు
YSR Shaadi Tohfa Scheme కోసం కావాల్సిన పత్రాలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు కాబడుతున్న YSR Kalyanamasthu Scheme 2022 కోసం అవసరమైన డాక్యుమెంట్ల పూర్తి జాబితా క్రింది విధంగా ఉంది.

  • వధువు & వరుడు ఆధార్ కార్డులు.
  • మ్యారేజ్ సర్టిఫికేట్.
  • పెళ్లి ఫోటోలు.
  • పెళ్లి కార్డు (ఇన్విటేషన్ కార్డు).
  • ఫోటోలు. సంతకం
  • వికలాంగులు అయితే శాశ్వత వికలాంగతత్వంను ధృవీకరించే సదరం సర్టిఫికెట్.
  • వితంతువు భర్త మరణ ధ్రువీకరణ పత్రము, వితంతు పెన్షన్ కార్డు. రెండు లేకపోతే ఆఫీడివిటి సెర్టిఫికెట్.
YSR Kalyanamasthu Shaadi Tohfa Scheme దరఖాస్తు విధానం :

గ్రామ, వార్డు సచిలవాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.