Jagananna Ammavodi Scheme జగనన్న అమ్మవడి పథకం

Jagananna Ammavodi :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తూ వస్తుంది. ఇందులో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి స్కీమ్ అద్భుతమైన స్కీమ్గా చెప్పుకోవచ్చు. నవరత్నల్లో భాగమైనటువంటి ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలలోనికి నేరుగా ప్రతి ఏటా రూ.15 వేలు జమ చేస్తుంది. పేద కుటుంబంలోని పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలనే మంచి లక్ష్యంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు జనవరి 2020ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వం రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ చేస్తోంది.

మరిన్ని ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారాన్ని పొందుటకు మా టెలిగ్రామ్ గ్రూప్ లలో చేరగలరు
టెలిగ్రామ్
వాట్సాప్ గ్రూప్ – 8
telugunewsadda

Ammavodi Scheme Details :

పేరుజగనన్న అమ్మవడి
పథకం ప్రారంభించినదివైఎస్ఆర్ జగన్ మోహన్ రెడ్డి
లబ్ధిదారులుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు
ప్రారంభించిన తేది జనవరి, 2020
ధ్యేయంపేద కుటుంబంలోని పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలనే మంచి లక్ష్యం
అధికారిక వెబ్సైటు jaganannaammavodi.ap.gov.in
ammavodi Scheme
Latest ammavodi updates

Ammavodi Scheme Eligibility :

అర్హతలు :

  • తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివుతూ ఉండాలి.
  • అయితే విద్యార్థుల 75 శాతం హాజరు ఉన్న వారికే అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది.

Required Document to apply For Ammavodi Scheme :

  • తెల్ల రేషన్‌ కార్డు ఉండాలి.
  • విద్యార్థుల తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్‌ కార్డు ఉండాలి.
  • బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి.
  • విద్యార్థులు కనీసం 75 శాతం హాజరును కలిగి ఉండాలి.
  • ప్రభుత్వ ఉద్యోగస్థులు ఈ పథకానికి అర్హులు కాదు.

వివరాలు చెక్ చేయడం ఎలా :

అమ్మఒడి పథకం కింద అర్హత కలిగిన విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లోనే తనిఖీ చేయకోవచ్చు. ఎవరెవరికి డబ్బులు వస్తాయో ముందే చెక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు జగనన్న అమ్మఒడి వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ సెర్చ్ చైల్డ్ డీటైల్స్ ఫర్ అమ్మఒడి అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. వెంటనే వేరే పాప్ అప్ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు సంబంధిత జిల్లాను ఎంచుకోవాలి. వెంటనే మీ వివరాలు స్క్రీన్ పై డిస్ప్లే అవుతాయి. ఇలా మీరు వివరాలు తెలుసుకోవచ్చు.

How to apply Jaganannaammavodi Scheme :
  • ముందుగా jaganannaammavodi.ap.gov.in/AMMAVODI/ వెబ్ సైట్లో దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి లేదా మీ సమీప వార్డు సచివాలయం లేదా గ్రామ సచివాలయంలో దరఖాస్తు ఫారం పొందవచ్చు.
  • ఆ తర్వాత దరఖాస్తులో మీ వ్యక్తిగత వివరాలన్నీ నింపాలి.
  • అవసరమైన పత్రాలన్నీ జత చేయాలి.
  • తిరిగి దరఖాస్తు ఫారాన్ని గ్రామ సచివాలయంలో సమర్పించాలి.

అఫీషియల్ లింక్స్ :

అఫీషియల్ వెబ్సైట్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
railway jobs 2023

జాబ్ అప్డేట్స్ :

సంప్రందింపు వివరాలు :

  • అమ్మ ఒడి పథకం సంప్రదింపు వివరాలు – చిరునామా 4వ అంతస్తు, B బ్లాక్, VTPS రోడ్డు, భీమరాజు గుట్ట, ఇబ్రహీంపట్నం – 521456
  • ఫోన్ నంబర్ – 9705454869/ 9705655349
  • ఈ మెయిల్ – idapcse.@ap.gov.