APPSC Recruitment 2023 ఏపీపీఎస్సీ ద్వారా 3282 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

APPSC Recruitment 2023 :

APPSC ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి 16వ తేదీన నోటిఫికేషన్ రానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్యను అత్యున్నతుగా తీర్చిదిద్ది, విద్యార్థులను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేయడానికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశ్వవిద్యాలయాల్లో బోధన ప్రమాణాల పెంపుతో పాటు, పలు సంస్కరణలు తీసుకొచ్చారు. మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో శాశ్వత పోస్టులను భర్తీ చేయడానికి యూని వర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా వర్సిటీల్లోని ప్రతి డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసర్, రెండు ఆసోసియేట్, నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండేలా పోస్టులను భర్తీ చేయనున్నారు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

18 వర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి 3,282 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. సాధారణ విశ్వవిద్యాలయాలు, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకే తిక విశ్వవిద్యాలయాల్లో కలిపి 3,282 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల కానుంది. విశ్వ విద్యాలయాల వారీగా ప్రకటనలు వెలువడిన ఆనంతరం సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఫలితాలను వర్సిటీలకు పంపిస్తారు. ఈ మార్కుల ఆధారంగా వర్సిటీలు మౌఖిక పరీక్షలు నిర్వహించి, ఎంపిక చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలానే డియస్సి విషయం ప్రస్తావించినపుడు, డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహించనున్నట్లు మంత్రి గారు తెలిపారు.

  • అర్హతలు, అప్లై విధానం లాంటి పూర్తి వివరాలకు క్లిక్ చేయండి. – క్లిక్ హియర్

Author: telugunewsadda

9 thoughts on “APPSC Recruitment 2023 ఏపీపీఎస్సీ ద్వారా 3282 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *