AP Ration Card Download Process మీ మొబైల్లోనే 5 నిమిషాలలో రైసె, రేషన్ కార్డు డౌన్లోడ్ చేయు విధానం

AP Ration Card Download Process :

ఆహార ధాన్యాన్ని సబ్సిడీ ధరకు కొనుగోలు చేయడానికి అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆహార వస్తువులను రేషన్ దుకణాల ద్వారా చౌక ధరలకు అందించడానికి భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డును అందిస్తాయి. అంతేకాకుండా, రేషన్ కార్డు గుర్తింపు రుజువుగా మరియు చిరునామా రుజువుగా కూడా పనిచేస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ అప్లై చేసిన 160 రోజులలోనే ప్రతి లబ్ధిదారునికి Rice Cards కార్డ్ ను వినియోగదారుల వ్యవహారాల శాఖ, ఆహారం మరియు పౌర సరఫరాలు, ఆంధ్రప్రదేశ్ ద్వారా జారీ చేయబడింది. ఈ రేషన్ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి వంటి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు క్రింది మా టెలిగ్రామ్ గ్రూపులో చేరగలరు – టెలిగ్రామ్ గ్రూపు

AP Rice Card Download Process 2023 :

ప్రస్తుతం మనం రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన Digilocker అనే వెబ్సైట్ నుండి రేషన్ కార్డు లేదా రైస్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ క్రింద తెలిపిన దశలను అన్ని పాటించి మీ మొబైల్ లో మీరే సింపుల్గా రేషన్ కార్డు లేదా రైస్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి.

Step 1 – ముందుగా మీరు Digilocker కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ www.digilocker.gov.in/ పై క్లిక్ చేయండి. క్రింది కనిపించిన విధంగా మీకు వెబ్సైట్ ఓపెన్ అవ్వటం జరుగుతుంది.

Step 2 – అక్కడ కుడి వైపు పైన చివరి భాగంలో మీరు SIGN IN అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

Step 3 – మీకు ఈ Digilocker వెబ్ సైట్ లో already అకౌంట్ ఉంటే మీ మొబైల్ నెంబర్ మరియు పిన్ ఎంటర్ చేసి Sign in పైన క్లిక్ చేయండి. ఒక వేళ అకౌంట్ లేక పోతే ఇవ్వబడిన Sign Up పై క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేయండి.

Step 4 – మీ యూసర్ ఐడి మరియు పాస్ వర్డ్ ను ఉపయోగించి Sign in అవ్వగానే హోమ్ పేజీ క్రింది విధంగా రావడం జరుగుతుంది.

Step 5 – మీరు పైన 3 Lines మీద క్లిక్ చేయండి. తరువాత మీరు Serch Documents అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా మీకు రావడం జరుగుతుంది.

Step 6 – Serch Box లో Rice Card అని టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు రేషన్ కార్డ్ ఫుడ్ సివిల్ సప్లైస్ ఆంధ్రప్రదేశ్ అని రావడం జరుగుతుంది, దానిపై క్లిక్ చేయండి.

Step 7 – పైన ఫోటోలో వచ్చిన విధంగా మీకు రావడం జరుగుతుంది. అక్కడ మీరు మీ రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. చేయగానే కింద గెట్ డాక్యుమెంటన్ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా పేజీ రావడం జరుగుతుంది.

Step 8 – పైన ఫోటోలో చూపించిన విధంగా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే PDF అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 9 – చివరిగా మీరు మీ యొక్క రేషన్ కార్డును PDF రూపంలో మీ మొబైల్ లో చూడవచ్చు. మీ రైస్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు మరియు మీ రైస్ కార్డు యొక్క కుటుంబ పెద్ద ఫోటో పూర్తి వివరాలు మీ మొబైల్ నందే చెక్ చేసుకోగలరు.

డౌన్లోడ్ లింక్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
Ap govt jobs 2023

జాబ్ అప్డేట్స్ :

Author: telugunewsadda

3 thoughts on “AP Ration Card Download Process మీ మొబైల్లోనే 5 నిమిషాలలో రైసె, రేషన్ కార్డు డౌన్లోడ్ చేయు విధానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *