AP Jobs గ్రామ పంచాయతీలలో 10th అర్హతతో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు

AP Jobs 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, వైయస్సార్ కడప జిల్లా పంచాయతీలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. సొంత గ్రామాలలోనే కేవలం 10వ తరగతి అర్హతతో ఒక పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందవచ్చు కావున ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే మంచి అవకాశాన్ని కల్పించారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు ఆయా పంచాయతీ పరిధిలోని గ్రామాలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని ఇటువంటి ఉద్యోగాల సమాచారాన్ని పొందుటకు మా వాట్సాప్ గ్రూపులో చేరగలరు – వాట్సాప్ గ్రూప్

AP Anganwadi jobs 2023 :

కడప డివిజన్ పరిధిలో 08 పోస్టులు కలవు. ఇందులో మినీ అంగన్వాడీ టీచర్ – 01, ఆయా – 07 మరియు బద్వేలు డివిజన్ పరిధిలో 03 పోస్టులు కలవు. ఇందులో 04 కూడా ఆయా పోస్టులే. జమ్మలమడుగు డివిజన్ పరిధిలో 06 పోస్టులు కలవు. ఇందులో మినీ అంగన్వాడీ టీచర్ – 01, ఆయా – 05 పోస్టులు కలవు. పులివెందుల డివిజన్ పరిధిలో 03 పోస్టులు కలవు. ఇందులో 03 కూడా ఆయా పోస్టులు కలవు.

అర్హతలు గమనిద్దాం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారు స్థానిక వివాహిత మహిలై ఉండాలి, అనగా సొంత పంచాయతీలో నివసిస్తున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 21 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం SC, ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.

WDCW Anganwadi jobs 2023 Application form :

అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు స్వీకరణకు నవంబర్ 30, 2023 చివరి తేదీగా తెలియజేసారు. దరఖాస్తు పత్రమును సరైన సమాచారంతో నింపి కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మేమో, ఆధార్ కార్డు, వికలాంగత్వమునకు సంబంధించిన పత్రములను, అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి.

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
telugu news adda

మరిన్ని జాబ్స్ :

Author: telugunewsadda

1 thought on “AP Jobs గ్రామ పంచాయతీలలో 10th అర్హతతో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *